‘ఖుషి’ నుంచి డిప్యూటీ సీఎం.. భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

khushi

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్టార్డం ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఒకరు. మరి నడిచిన ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన లవ్ క్లాసిక్ చిత్రం ఖుషి కూడా ఒకటి. మరి ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. అయితే ఇద్దరికీ ఇదే ఇద్దరికీ మొదటి చిత్రం ఆఖరి సినిమా కూడా కాగా లేటెస్ట్ గా పవన్ పై భూమిక చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

పవన్ ఖుషి నుంచి ఇప్పుడు డెప్యూటీ సీఎం వరకు తన జర్నీ ఎంతో ప్రత్యేకం అని ఒక సహా నటిగా మధుగా భూమికగా నాకు ఎంతో గర్వంగా ఉందని ఆమె రీసెంట్ గా ‘యుఫోరియా’ ఈవెంట్ లో ఆమె తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భూమిక నటించిన యుఫోరియా చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించగా ఈ చిత్రంలో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ కూడా నటించింది. ఈ యూత్ ఫుల్ క్రైమ్ డ్రామా ఈ ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది.

Exit mobile version