పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అందరి ఫోకస్ నేటి సాయంత్రం జరగబోయే గ్రాండ్ ఈవెంట్‌పైనే ఉంది.
హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక అత్యంత భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం వాలిడ్ పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక వేదికపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? సినిమా గురించి ఎలాంటి విశేషాలు పంచుకుంటారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్తిబన్, గౌతమి, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరోవైపు మార్చి 19న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అడ్వాన్స్ బుకింగ్స్ గురించి కూడా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
