యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓటీటీలో ప్రస్తుతం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అటు విమర్శకుల నుండి సైతం మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు, అమెజాన్ ప్రైమ్ వీడియోలో 3 భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా ఓటీటీలో ఈ సినిమాకి బాగా ఆదరణ దక్కుతుంది అని నిర్మాతలు ఆశించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఓటీటీలో ఈ సినిమాని చూసిన వారు, ఈ సినిమా కథాకథనాలకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా, తెలుగు హీరోయిన్ మానస వారణాసి నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాని పెద్ద తెరపై చూడకపోవడం పట్ల కొందరు నిరాశ వ్యక్తం చేస్తూ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. యువీ కాన్సెప్ట్స్ మరియు విఆర్ గ్లోబల్ మీడియా పతాకాలపై అజయ్ కుమార్ రాజు పి నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు.
