‘మహావతార్ నరసింహా’ టీం నుంచి కొత్త చాప్టర్ టైటిల్ కి టైం ఫిక్స్!

mahavatar narasimha

గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా అనే చెప్పాలి. నోటెడ్ నటీనటుల వాయిస్ లేదు స్టార్ కాస్ట్ ప్రమోషన్స్ కూడా లేవు. పూర్తిగా మేకర్స్ నమ్మకం సినిమా తాలూకా డివోషనల్ కంటెంట్ ఈ సినిమాకి నెవర్ బిఫోర్ రికార్డులు తెచ్చి పెట్టింది.

అయితే ఈ సినిమా మేకర్స్ ఒక సిరీస్ నే తీసుకొస్తుండగా లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. రేపు ఆదివారం ఉదయం 11 గంటల 22 నిమిషాలకి తమ కాంబినేషన్ నుంచి ఓ కొత్త చాప్టర్ తాలూకా టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా మహావతార్ నరసింహా సినిమా కట్స్ ప్రోమో ఒకటి పెట్టి అప్డేట్ అందించారు.

దీనితో ఆ అప్డేట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. నిజానికి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి నెక్స్ట్ మహావతార్ పరశురామ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అప్డేట్ లో మాత్రం దాని కోసం చిన్న హింట్ కూడా లేదు. సో మహావతార్ నరసింహా కి కొనసాగింపుగా మరో పార్ట్ చేస్తారా లేదా పూర్తిగా వేరే అప్డేట్ నా అనేది రేపటి వరకు ఆగి చూడాల్సిందే.

Exit mobile version