నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. అవే ‘పటాస్’ మరియు ‘షేర్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా న్యూ షెడ్యూల్ ఈ నెల 14 నుంచి హైదరాబాద్ కానుంది. ముందుగా ‘పటాస్’ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనతో కళ్యాణ్ రామ్ ముందు ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సీన్స్ రూపుదిద్దుకొంటున్న విషయంలో మరియు తన పోలీస్ పాత్ర కూడా బాగా వస్తున్నందుకు కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.


