
ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ‘అవును 2’ చిత్రీకరణ నేటితో(సెప్టెంబర్ 9) పూర్తయింది. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. 2012లో విడుదలై మంచి విజయం సాదించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అవును’ సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు రవిబాబు.
‘అవును’లో నటించిన హర్షవర్ధన్ రాణే, పూర్ణ ‘అవును 2’ లో కూడా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో నికిత రీ ఎంట్రీ ఇస్తుంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

