కం బ్యాక్ ఫిల్మ్ తో సిద్దమైన రేవతి

కం బ్యాక్ ఫిల్మ్ తో సిద్దమైన రేవతి

Published on Sep 11, 2014 8:00 AM IST

Revathi
సీనియర్ నటి రేవతి గుర్తుందా.? అచ్చతెలుగమ్మాయిలా ఉంటూ కళ్ళతోనే హావ భావాలను కలిగించగలిగిన రేవతికి నటిగా మంచి పేరుంది. 1990లలో ‘గాయం’, ‘రాత్రి’, ‘ప్రేమ’, ‘లంకేశ్వరుడు’ లాంటి సినిమాల్లో నటించిన రేవతి తెలుగులో చివరిగా చేసిన సినిమా ‘గాయం 2’.

చాలా సంవత్సరాల తర్వాత రేవతి తన కం బ్యాక్ ఫిల్మ్ తో సిద్దమైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంకి రానున్న అనుక్షణం మూవీలో ఓ కీలక పాత్రలో రేవతి కనిపించనుంది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ టైంలో రేవతి ఎన్నో సోషల్ వెల్ఫేర్ కోసం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలే హిందీలో వచ్చిన ‘2 స్టేట్స్’ సినిమాలో రేవతి ఓ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

రేవతి ఇక నుంచి తెలుగులో మంచి రోల్స్ వస్తే వరుసగా సినిమాలు చేయాలనుకుంటోంది. కొంతమంది లోనే బ్యూటీ, టాలెంట్ కలిసి ఉంటాయి, అది రేవతిలో ఉంది. మరి మన డైరెక్టర్స్, నిర్మాతలు ఎంతవరకూ
ఆఫర్స్ ఇస్తారో చూడాలి..

తాజా వార్తలు