ఆగడు కోసం సరికొత్త తరహా ప్రమోషన్స్

ఆగడు కోసం సరికొత్త తరహా ప్రమోషన్స్

Published on Sep 14, 2014 7:25 PM IST

aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు చేస్తున్న ప్రమోషన్స్ తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ కి సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్ అని టైటిల్ పెట్టి ఆ ట్రైన్ మొత్తం ఆగడు పోస్టర్స్ తో వినూత్నంగా ప్రచారం చేసారు.

అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లేనంతగా సుమారు 160 అడుగులు పొడవు గల బ్యానర్ ని ని పెట్టి అందరి చూపును ఆకర్షించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మహేష్ బాబు కడపలోని దర్గాని విజిట్ చేసి ప్రార్ధనలు చేసాడు. ఈ చిత్ర టీం చేస్తున్న వినూత్న ప్రచారంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా జోడీ కట్టింది. శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు