
కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత కొంతమంది అది ఆగిపోయిందని అంటే, కొందరు అసలు ఉండదని అన్నారు. అయినా కానీ ఈ సినిమా ఇంకా వార్తల్లో తిరుగుతూనే ఉంది. ఆ విషయంపై మేము ఒక వార్తని మీకంద జేయనున్నాం
తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ – సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే పనిలో భాగంగా సుకుమార్ గోవాలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ ఉండే అవకాశం ఉంది.
గత కొంత కాలంగా ఎన్.టి.ఆర్ కి సరైన హిట్ పడకపోవడంతో సరైన హిట్ కోసం కథల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాగే తొందరపడి కమిట్ అయిపోకుండా ఒకటి నాలుగు సార్లు పూర్తి స్క్రిప్ట్ పూర్తయ్యాకనే సెట్స్ పైకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

