
ప్రస్తుతం చాలా బిజీ గా వుంటూ ఎన్నో భాషల్లో నటిస్తున్న నటి తాప్సీ పన్ను. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన తాప్సీ కాలేజీ రోజుల్లో ఎంతో చురుకయినది. అనుకోకుండా సినిమా రంగం లో మంచి విజయాలు సాధిస్తుంది.
తన సినిమా కెరీర్ లో మంచి స్థానం సంపాదించినా కాని పై చదువులు చదవాలన్న ఆశ తాప్సీ కి ఇంకా పోలేదు. ఈ విషయం గురించి మాట్లాడుతూ సమయం అనుకూలిస్తే చదువు కొనసాగిస్తానని తాప్సీ తెలిపింది. పై చదువులు త్వరగా పూర్తి చేసుకున్న తర్వాత తనకి ఇష్టమైన సినిమా రంగంలో తిరిగి రాణించాలని కోరుకుందాం.

