నిఖిల్‌తో కోన వెంకట్ ‘శంకరాభరణం’!

నిఖిల్‌తో కోన వెంకట్ ‘శంకరాభరణం’!

Published on Mar 14, 2015 9:21 AM IST

Kona-venkat-nikhil

ప్రముఖ సినీ రచయిత కోనవెంకట్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా ‘గీతాంజలి’ వంటి హిట్ సినిమాని అందించిన ఆయన తాజాగా వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖి‌తో జత కడుతున్నారు. బీహార్ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ సినిమా ఇదని ఆయన అన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తూ కోనవెంకట్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఇదే విషయాన్ని కోనవెంకట్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. తమ సంస్థలో నిఖిల్‌ హీరోగా శంకరాభరణం పేరుతో సినిమా తీస్తున్నామని, పూర్తి క్రైమ్ కామెడీ కథగా ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన తెలిపారు. ప్రవీణ్ లక్కిరాజు సంగీతం సమకూర్చనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.

తాజా వార్తలు