హాలీవుడ్ సినిమాలో.. మాధవన్!

హాలీవుడ్ సినిమాలో.. మాధవన్!

Published on Mar 15, 2015 2:12 AM IST

madhavan22
హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల చిత్రాలకూ సుపరిచితుడైన మాధవన్.. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయం కాబోతున్నాడు. ఇప్పటివరకూ దక్షిణ భారత దేశంలో ఒక్క నటుడు కూడా హాలీవుడ్‌లో కనిపించిన దాఖలాలు లేవు. హిందీ నుంచి ఇర్ఫాన్ ఖాన్ లాంటి కొందరు తారలు హాలీవుడ్‌కి వెళ్ళినా, దక్షిణ భారత పరిశ్రమ నుంచి ఎవ్వరూ హాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడా క్రెడిట్‌ను కొట్టేశాడు మాధవన్.

హాలీవుడ్‌లో హర్రర్ సినిమా అంటే మొదటగా గుర్తుకు వచ్చే ‘ఎవిల్ డెడ్’ సినిమా తాజా సిరీస్‌లో ఓ కీలక పాత్రకు మాధవన్ ఎంపికయ్యాడు. ఎవిల్ డెడ్ తాజా సిరీస్‌లో మాధవన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ఇరుదు సొత్తు అన్న ద్విభాషా చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్న మాధవన్ త్వరలోనే ఎవిల్ డెడ్ సిరీస్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు