బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ డేట్ & డీటైల్స్

బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ డేట్ & డీటైల్స్

Published on Mar 15, 2015 11:37 AM IST

Balakrishna-chandrababu
నందమూరి నటసింహం బాలకృష్ణ పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా నటించిన సినిమా ‘లయన్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమాలోని ప్యాచ్ వర్క్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రధాన తారాగణంపై ఓ ఫ్యామిలీ సాంగ్ షూట్ ని ఫినిష్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ఆడియో, రిలీజ్ విషయాలపై చాలా రోజుల నుంచి ఆసక్తి నెలకొంది. ఆ విశేషలాను మీకందిస్తున్నాం.. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ‘లయన్’ సినిమా ఆడియోని ఏప్రిల్ 9న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. ఏప్రిల్ 9న శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు.

అలాగే ఈ సినిమాని ఏప్రిల్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందించాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో పాటు ప్రజాసేవకి కూడా సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా మార్చి చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు