తమిళ్లోమొదలైంది., మరి తెలుగులో ఎప్పుడు.?

తమిళ్లోమొదలైంది., మరి తెలుగులో ఎప్పుడు.?

Published on Mar 18, 2015 4:12 PM IST

Bangalore-Days-remake-launc

గత సంవత్సరం మలయాళంలో ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ కూడా సాధించిన సినిమా ‘బెంగుళూరు డేస్’. మలయాళ స్టార్స్ అయిన దల్క్వేర్ సల్మాన్, నివిన్ పాళీ, ఫహద్, నజరియా, నిత్యా మీనన్, ఇషా తల్వార్, పార్వతి మీనన్ కలిసి నటించిన ఈ సినిమాకి అంజలి మీనన్ డైరెక్టర్. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చెయ్యడానికి దిల్ రాజు – పివిపి కలిసి రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాలో సరైన నటీనటుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ తెలుగులో మాత్రం ఫైనలైజ్ అవ్వలేదు.

కానీ తమిళ్ కి మాత్రం నటీనటులు దొరకడంతో తమిళ రీమేక్ ని ప్రారంభించారు. తమిళంలో ఆర్య, రానా, బాబీ సింహ, శ్రీ దివ్య ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. నేడు ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళంలో ఈ సినిమా ప్రారంభం కూడా అయిపోయింది. కానీ తెలుగులో మాత్రం ఇంకా నటీనటులు కూడా ఫైనలైజ్ కాలేదు. దాంతో తెలుగు రీమేక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.? అసలు మొదలవుతుందా.? అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

తెలుగు రీమేక్ లో హీరోల కోసం నాగ చైతన్య, శర్వానంద్, సిద్దార్థ్ లాంటి పేర్లు వినిపించినా ఎవ్వరూ ఓకే కాలేదు. ఒకవేళ ఈ సినిమా మొదలైతే తెలుగులో ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు