
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ క్రేజీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక్క పాట షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఇటీవలే ఈ సినిమాలోని ఓ పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని మే 15న మొదటి పార్ట్ రిలీజ్ కానుందని తెలియజేసారు.
దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ఈ చిత్ర టీంకి రానున్న రెండు నెలల్లో ఒక్క సెలవు దినం కూడా లేదని ఈ చిత్ర హెడ్ రాజమౌళి ప్రకటించాడు. దాంతో ఈ చిత్ర టీం రెండు నెలల పాటు రాత్రింబవళ్ళు వర్క్ చేసి ఫస్ట్ పార్ట్ వర్క్ ని ఫినిష్ చేయనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

