అక్కినేని హీరోస్ లాంచ్ చేసిన సుశాంత్ ఫిల్మ్

అక్కినేని హీరోస్ లాంచ్ చేసిన సుశాంత్ ఫిల్మ్

Published on Mar 21, 2015 2:10 PM IST

Sushanth
‘అడ్డా’ సినిమాతో హిట్ అందుకున్న అక్కినేని హీరో సుశాంత్ తన తదుపరి సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. సుశాంత్ తన తదుపరి సినిమాని కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. ఈ సినిమాని ఉగాది కానుకగా ఈ రోజు లాంచ్ చేసారు. ఈ అధికారిక లాంచ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.

ఈ వేడుకకి అక్కినేని హీరోలైన అక్కినెనీ నాగార్జున, నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు హాజరయ్యారు. అందరూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. శ్రీజి ఫిల్మ్స్ అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 10 నుంచి మొదలవుతుంది. జి నాగేశ్వర్ రెడ్డి సుశాంత్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసాడు. నాగేశ్వర్ రెడ్డి చేసిన గత రెండు సినిమాలు (దేనికైనా రెడీ, కరెంట్ తీగ)మంచి విజయాన్ని అందుకున్నాయి.

తాజా వార్తలు