
అచ్చ తెలుగమ్మాయి యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇది కాకుండా అప్పుడప్పుడు పలు సినిమాల్లో పాటలు కూడా పాడుతుంటుంది. ఈ సారి స్వాతి త్రిష – అంజలి హీరోయిన్స్ గా జయం రవి హీరోగా నటిస్తున్న ‘అప్ప తక్కర్’ అనే సినిమాలో ఓ పాట పాడటానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాగా పెప్పీగా సాగే ఓ సాంగ్ కోసం తమన్ సవతిని సెలెక్ట్ చేసాడు.
ఈ పాటలో ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే ఈ పాట కోసం స్వాతితో పాటు తమిళ స్టార్ హీరో శింబు కూడా గొంతు కలపనున్నాడు. శింబు – స్వాతి కాంబినేషన్ లో వచ్చే సాంగ్ ని త్వరలోనే రికార్డ్ చేయనున్నాడు. తెలుగులో స్వామి రారా, కార్తికేయ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న స్వాతి ప్రస్తుతం తమిళ, మలాయల సినిమాలు చేస్తూ తెలుగులో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది.

