ఫోటోమూమెంట్ : కూతురు ఆద్యాతో పవన్..!

ఫోటోమూమెంట్ : కూతురు ఆద్యాతో పవన్..!

Published on Mar 24, 2015 1:26 AM IST

Pawan-Kalyan-with-Daughter
పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు, , రాజకీయ నాయకుడు.. ఈ బాధ్యతలన్నీ భుజానికెత్తుకున్న వ్యక్తి, పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ స్థానానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆయన ఈ మధ్యే ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. ఈ బాధ్యతలన్నీ ఒక వైపేతే, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు తండ్రి. తండ్రిగా వాళ్ళతో గడపాల్సి రావడం, వారి బాగోగులు చూసుకోవాల్సి రావడం మరో అతిపెద్ద బాధ్యత. పవన్, ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా పోషిస్తున్నారు.

ఇక గత కొంతకాలం క్రితం, మాజీ భార్య రేణూ దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ విడిపోయిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోయినా పిల్లలు అకిరా, ఆద్యాల విషయంలో మాత్రం పవన్ అశ్రద్ధ కనబర్చలేదు. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలకు సమయం కేటాయించి వారితో సంతోషాలను పంచుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా తన కూతురు ఆద్యా పుట్టినరోజు వేడుకలకు పవన్ హాజరవనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ప్రైవేటు పార్టీగా ఈ కార్యక్రమం సాగనుందని తెలిసింది. “పవన్ కళ్యాణ్.. జనాలకు ఎంత పెద్ద స్టారైనా, రాజకీయ నాయకుడైనా కూతురు ఆద్యాకు మాత్రం ఆయనో నాన్న మాత్రమే!” అంటూ రేణూ దేశాయ్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటే తండ్రీ, కూతుర్ల ఆత్మీయ బంధానికి ప్రతీకగా కనిపిస్తున్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు