ఇకపై వరుస సినిమాలు చేస్తానంటున్న శివబాలాజీ

ఇకపై వరుస సినిమాలు చేస్తానంటున్న శివబాలాజీ

Published on Mar 24, 2015 12:44 AM IST

shivabalaji
శివబాలాజీ.. తెలుగులో కొన్ని గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో నటించి నటుడిగా ప్రతి ఒక్కరికీ గుర్తుండే వ్యక్తి. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పెద్ద సినిమాల్లోని కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్య, సంక్రాంతి, చందమామ, శంభో శివ శంభో వంటి చిత్రాల ద్వారా శివబాలాజీ అందరికీ సుపరిచితమే. గత కొంతకాలంగా తెలుగుతెరపై కనిపించకుండా పోయిన శివబాలాజీ తాజాగా జెండాపై కపిరాజు సినిమాతో మళ్ళీ మెరిశాడు.

గతంలో సముద్రఖని దర్శకత్వం వహించిన శంభో శివ శంభోలో ఓ అద్భుత పాత్రలో నటించిన శివబాలాజీ, తాజాగా అదే దర్శకుడు రూపొందించిన జెండాపై కపిరాజులోనూ ఓ మంచి పాత్రలో నటించాడు. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఇక నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. నానితో పాటు శివబాలాజీకి కూడా మంచి పేరు వచ్చింది. జెండాపై కపిరాజ్ సినిమాతో మళ్ళీ వెలుగులోకొచ్చిన శివబాలాజీ, సినిమా విశేషాలను తెలియజేస్తూ.. సినిమా విజయం సంతృప్తినిచ్చిందని, ఇకపై వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు