శరవేగంగా సినిమా ముగించనున్న మహేష్ బాబు

శరవేగంగా సినిమా ముగించనున్న మహేష్ బాబు

Published on Apr 2, 2015 11:16 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన కానుకగా మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రారంభంకానుందని మేము ముందుగానే తెలిపాం. ఈ సినిమాను సీతమ్మ వాక్తిలో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని తీసిన శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్నారు. పి.వి.పి బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం కానుంది. తాజా సమాచారం ప్రకారం దసరాకి ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.

90రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలకు కావలిసినంత సమయాన్ని వినియోగించనున్నారు. మమోలుగా షూటింగ్ కే 100 నుండి 120 రోజులు తీసుకునే మహేష్ లో ఇంతమార్పు రావడం ఆశ్చర్యకరం. ఈ వార్త కార్యరూపం దలుస్తుందా అని అభిమానులు ఆలోచిస్తుంటే చిత్ర బృందం మాత్రం నమ్మకం వ్యక్తం చెయ్యడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు