నిత్యామీనన్ పాత్ర.. సినిమాకే హైలైట్!

నిత్యామీనన్ పాత్ర.. సినిమాకే హైలైట్!

Published on Apr 7, 2015 1:01 PM IST

Nitya-menon
నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘ముని’, దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ సినిమాలైతే సూపర్ హిట్లుగా నిలిచి లారెన్స్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి. హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత విడుదలైన హర్రర్ సినిమాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడీ కోవలోనే ముని సిరీస్‌లో మూడో భాగంగా ‘కాంచన-2’ రానుంది.

తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన నిత్యామీనన్‌ పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా చెప్పబడుతుంది. సినిమాలోని ప్రధానమైన మలుపుకు నిత్యాయే కారణమవుతుందని తెలుస్తోంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల్లోనే విడుదలకు సిద్ధమౌతోంది ‘కాంచన 2’. తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెల్లంకొండ్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు