‘రోగ్’కి హైప్ పెంచే పనిలో పూరి జగన్నాధ్

‘రోగ్’కి హైప్ పెంచే పనిలో పూరి జగన్నాధ్

Published on Oct 6, 2015 6:50 PM IST

Puri
ఇటీవలే ‘జ్యోతి లక్ష్మీ’ సినిమాతో చార్మింగ్ బ్యూటీ చార్మీకి కావాల్సిన హిట్ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకి ‘మా అమ్మ మహాలక్ష్మి’. ఈ సినిమా తర్వాత ఓ కొత్త హీరోతో పూరి తన తదుపరి సినిమాని చేయనున్నాడు. కన్నడ నుంచి వస్తున్న ఇషాన్ అనే హీరోని పరిచయం చేస్తూ ఒకేసారి తెలుగు – కన్నడ భాషల్లో సినిమా చేయనున్నాడు.

అప్పుడే పూరి ఈ సినిమాకి హైప్ పెంచే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానీ ఈ సినిమా కోసమే పూరి జగన్నాధ్ రోగ్ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. పూరి కోసం స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తను ఒక కొత్త హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి పూరి అన్నీ సిద్దం చేసుకుంటున్నాడు. ఈ సినిమా ద్వారా కూడా పూరి ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేసే పనిలో ఉన్నాడు.

తాజా వార్తలు