
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ ఏ’ సర్టిఫికేట్ అందుకొని అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం అన్ని ఏరియాలకు వెళ్ళాల్సిన ప్రింట్స్ డిస్పాచ్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ ‘బ్రూస్ లీ’ ఫ్యాన్స్ షోని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే భారీ అమౌంట్ ఓ అనాధ శరణాలయానికి దానం ఇచ్చేలా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసారు.
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తో కళామందిర్ వారు కూడా అసోషియేట్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఓ మంచి పనిలో మేము భాస్వాములు అవుతామని కళామందిర్ సిఐఓ కళ్యాణ్ వారితో అసోషియేట్ అయ్యారు. అక్టోబర్ 16వ తేదీ అర్థరాత్రి 1 గంటకు హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ఈ షో వేయనున్నారు. అలాగే మగా అభిమానులు మునుపెన్నడూ ఏ సినిమాకి లేని విధంగా బ్రూస్ లీ ఫ్యాన్స్ షో హంగామాని ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక 5 నిమిషాల పాటు కనిపించనుండడం వలన ఈ సినిమాకి మరింత క్రేజ్ నెలకొంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.

