‘సాహసం శ్వాసగా సాగిపో’ సమ్మర్‌కి షిఫ్ట్ అయిందా?

‘సాహసం శ్వాసగా సాగిపో’ సమ్మర్‌కి షిఫ్ట్ అయిందా?

Published on Jan 2, 2016 4:38 PM IST

Sahasam-Swasaga-Sagipo
హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘సాగసం శ్వాసగా సాగిపో’. ఏ మాయ చేశావే లాంటి అందమైన సినిమాను అందించిన ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై మొదట్నుంచే విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్న మొదటి టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. నాగ చైతన్య సరసన మంజీమ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది.

ఇక గత కొద్దిరోజులవరకూ ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయానున్నారనే ప్రచారం జరగగా, తాజాగా సినిమా సమ్మర్ కానుకగా మార్చి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. కొత్త సంవత్సరం కానుకగా నిన్న విడుదల చేసిన తమిళ వర్షన్ ట్రైలర్‌లో సమ్మర్‌లో సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. ఇక ద్విభాషా చిత్రం కాబట్టి తెలుగు వర్షన్ కూడా అదే బాటలో సమ్మర్‌లోనే రిలీజ్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు