లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది. ఆరంభం నుండి సినిమాపై పాజీవ్ ఒపీనియన్ ఉండటం, అనుష్క క్రేజ్, టీజర్, ట్రైలర్ అన్నీ బాగుండటంతో తొలిరోజు మంచి స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.
పైగా ఈరోజు రిపబ్లిక్ డే సెలవు కావడంతో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగానే కనబడింది. ఇక అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం, సంక్రాంతి సినిమాల్లో ‘జై సింహ’ మినహా మిగతావి పెద్డగా అలరించకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ చిత్రానికే ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా దక్కనుంది. జి. అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా విడుదలైంది.


