కృష్ణార్జున యుద్ధంలో నాని రెండు పాత్రలు ఇవే !

కృష్ణార్జున యుద్ధంలో నాని రెండు పాత్రలు ఇవే !

Published on Jan 27, 2018 7:28 PM IST

నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. మెర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. నిన్న నాని కార్ యాక్సిడెంట్ కు గురి అవ్వడంతో వారం పాటు నాని షూటింగ్ కు హాజరు కాలేకపోతున్న సంధర్బంగా సినిమా షూటింగ్ వారం తరువాత జరగనుంది.

ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇటీవల నాని రెండు లుక్స్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఫారిన్ లో ఉండే రాక్ స్టార్ పాత్రలో మరియు లోకల్ లో ఉండే రాయలసీమ దొంగగా రెండు విభిన్న పాత్రల్లో నాని కనిపించబోతున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు