లేడీ డైరెక్టర్ సినిమా విడుదల తేది ఖరారు !

లేడీ డైరెక్టర్ సినిమా విడుదల తేది ఖరారు !

Published on Jan 29, 2018 9:09 PM IST

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్ హీరో,హీరోయిన్స్ గా ఘ‌ట్ట‌మ‌నేని మంజుల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘మ‌న‌సుకు న‌చ్చింది’. ఇటివల విడుదలైన ఈ సినిమా టిజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. రతన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. స్నేహం, ప్రేమ అనే అంశాల నేప‌థ్యంలో ఈ సినిమా తెరకేక్కించింది దర్శకురాలు మంజుల.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. ఫిబ్రవరి 16 న ఈ మూవీ విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆనంది ఆర్ట్స్ ప్రొడక్షన్ లో కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించి సందీప్ కిషన్ కు హిట్ పడాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు