అంచనాలను అందుకున్న ‘తొలిప్రేమ’ ట్రైలర్ !

అంచనాలను అందుకున్న ‘తొలిప్రేమ’ ట్రైలర్ !

Published on Feb 2, 2018 12:04 PM IST

వరుణ్ తేజ్, రాశీ ఖన్నాలు నటించిన ‘తొలిప్రేమ’ ట్రైలర్ ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు ఉదయమే విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్ ను బట్టి ఈ ప్రేమ కొత్తగా, అందంగా ఉండబోతోందని ఇట్టే అర్థమవుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో ఆకట్టుకునే ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలని చాలానే రాసుకున్నట్టున్నాడు.

వరుణ్, రాశీ ఖన్నాలు జంట కూడా అందంగా కనిపిస్తోంది. థమన్ అందించిన మంచి సంగీతం, పాటలు, సూటిగా తగిలే మాటలు, క్వాలిటీతో కూడిన వెంకీ టేకింగ్, చక్కని సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి ట్రైలర్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచాయి. కొద్దిసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మించారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

తాజా వార్తలు