అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి’. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
మొదట ఈ సినిమా మార్చి 29 న విడుదలకానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఆ సమయానికి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఈ మూవీ కి సంభందించిన గ్రాఫిక్స్ పనులు పెండింగ్ లో ఉన్నందున సినిమా మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.


