‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తరువాత హీరో రామ్ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుండి మొదలుకానుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కెమెరా మెన్, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. త్రినాద్ గతంలో దర్శకత్వం వహించిన ‘సినిమా చూపిస్తా మామ, నేను లోకల్’ చిత్రాల తరహాలోనే ఈ సినిమా వినోధభరితంగా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో నటించబోయే మరో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది.


