ఇటీవల విడుదలైన ట్రైలర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న చిత్ర ట్రైలర్ ‘ఆర్ఎక్స్ 100’ . ఇక ఈ ట్రై లర్ ను చూశాక సినిమాని ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో పోల్చడం మొదలెట్టారు దాంతో ఈచిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ చిత్ర కథను ముందు ‘అర్జున్ రెడ్డి’ ఫెమ్ విజయ్ దేవరకొండకు వినిపించాడట చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి. విజయ్ కూడా ఈ చిత్ర కథ భాగా నచ్చిందని కాకపోతే ‘పెళ్లిచూపులు’ అనే చిత్రం చేస్తునాన్నిఈ చిత్రాన్ని తరువాత చేద్దామని చెప్పాడట. దాంతో ఈ డైరెక్టర్ కొత్త వారిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


