
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న151వ చిత్రం సైరా . స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం భారీ సెట్ ను నిర్మించారు . ఈ భారీ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదలచేయాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్ . ఎందుకంటే ఇటీవల అదే నెలలో విడుదలై రికార్డ్స్ ను బద్దలు కొట్టింది ‘రంగస్థలం’ చిత్రం. ఇక ఇప్పుడు ఈ చిత్రం కూడా ఆ సెంటిమెంట్ నే ఫాలో అవ్వనుందని సమాచారం . రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు .

