మంచు లక్ష్మి ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలను వైవిధ్యమైన పాత్రలను చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆమె అలాంటి పాత్రనే జ్యోతిక నటిస్తోన్న ‘కాట్రిన్ మొళి’ చిత్రంలో పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటించడం గురించి మంచు లక్ష్మి తన అభిప్రాయాలను వివరిస్తూ ట్వీట్ చేశారు. ‘వావ్.. జ్యోతికతో పనిచేయడం అద్భుతం. తనలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. నేను జ్యోతికకు పెద్ద అభిమానిని. ఈ చిత్రంతో తన పై ఇంకా ఇంకా అభిమానం పెరిగింది. ఎన్నో భావాలను తన కళ్లు అవలీలగా పలికించగలవు. తనని కెమెరా కూడా ప్రేమిస్తుంది’ అని మంచు లక్ష్మి జ్యోతిక పై తనకున్న అభిమానాన్ని ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
.
బోఫ్తా మీడియా వర్క్స్ పతాకం పై ధనుంజయన్ గోవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకుడు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎలకంటి విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ చిత్రం పై అంచనాలను పెంచింది.
Working w #jyothika… woah!! What a talent. Always been a huge fan now even more. Her eyes speak volumes and the camera just loves her #kaatrinmozhi @Suriya_offl
— Lakshmi Manchu (@LakshmiManchu) July 4, 2018


