2016 లో ప్రముఖ క్రికెటర్ ఇండియన్ టీం మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎమ్ ఎస్ ధోని:ది అన్ టోల్డ్ స్టోరీ. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు , తమిళ భాషల్లో ఒకే సారి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ , దిశా పటాని కథానాయికలుగా నటించారు.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 2011 వరల్డ్ కప్ తరువాత నుండి ఇప్పటివరకు ధోని జీవితంలో ఏం జరిగిందో ఈ చిత్రంలో చూపెట్టనున్నారు . ఈ వార్త నిజంగా ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుబడనున్నాయి.


