అంచనాలను పెంచుతున్న ‘గూఢచారి’ !

అంచనాలను పెంచుతున్న ‘గూఢచారి’ !

Published on Jul 4, 2018 6:43 PM IST

goodachari t

యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం ‘గూఢాచారి’ అనే సినిమా చేస్తున్నాడు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

టీజర్లో వాడిన సాంకేతికతను, విజువల్స్ ను చూస్తే అభిషేక్ పిక్చర్స్ సినిమాను పెద్ద స్థాయిలోనే నిర్మించినట్టు తెలుస్తోంది. ఒక రా ఏజెంట్ కథగా ఉండబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ను చూస్తే అడివి శేష్ ఖాతాలో హిట్ ఖాయమనే నమ్మకం కలుగుతోంది. అమెరికాతో పాటు సినిమా అస్సామ్, మేఘాలయ, ఢిల్లీ, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. అక్కినేని సుప్రియ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి 

తాజా వార్తలు