తమిళ స్టార్ హీరో సూర్య తన 37 వ సినిమాను ‘ రంగం’ ఫెమ్ కె వి ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడని తెలిసిందే . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , హిందీ విలక్షణ నటుడు బోమన్ ఇరానీ , అల్లు శిరీష్ మొదలగు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలోకి మరో స్టార్ హీరో ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ లో ఆర్య జాయిన్ అయ్యారు . ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
భారీ బడ్జెట్ తో సుమారు 10 దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. సాయేషా కథానాయికగా నటిస్తున్నా ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు . ఇక కె వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తుండడం ఇది మూడో సారి . ఇంతకుముందు వీరిద్దరి కలయికలో బ్రదర్స్ , వీడోక్కడే సినిమాలు రూపొందాయి


