ఇటీవల వరుసగా 5 పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అయితే నిన్న జరిగిన ‘తేజ్ ఐ లవ్ యు’రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ పరాజయాలపై ఆసక్తికర వాక్యలు చేశాడు. తేజు ఇటీవల చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఆడవు అని తెలిసి కూడా కేవలం వారి తో సినిమా చేస్తానని మాటివ్వడం వల్లే ఆ సినిమాలు ఒప్పుకున్నాడని ఆయన అన్నారు.
ఇక ప్రస్తుతం తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇటీవల వరుస పరాజయాల తరువాత చేసిన ఈ చిత్రమైన తనను గట్టెక్కిస్తుందని చాలా ఆశతోవున్నాడు తేజు.


