
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్ట్రర్లు, టీజర్ బాగుండటంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
జూలై 20వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 7వ తేదీన శనివారం శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

