చందు మొండేటి దర్శకత్వంలో యువ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్ర చివరి షెడ్యూల్ ఈ నెల 9నుండి ప్రారంభం కానుంది. 10 రోజులపాటు జరుగునున్న ఈషెడ్యూల్ లో చైతు, తమన్నాలపై స్పెషల్ సాంగ్ తో పాటు చిత్రానికి సంభందించిన మిగితా చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. దాంతో ఈ చిత్ర షూటింగ్ పూర్తికానుంది.
హ్యాట్రిక్ విజయాలను సాధించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటి నటులు మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్ కథానాయిక పాత్రను పోషిస్తోంది.


