‘అరవింద సమేత’ టీజర్ ఆ రోజున రానుంది !

‘అరవింద సమేత’ టీజర్ ఆ రోజున రానుంది !

Published on Jul 5, 2018 6:00 PM IST

Ntr0

జూ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర టీజర్ కోసం తారక్ అభిమానులుతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు