
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుంది ఈ చిత్రం. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరైతే.. శక్తి మేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు’ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది.
ట్రైలర్ చూస్తుంటే.. శ్రీను వైట్ల తన దర్శకత్వ శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. ఓ వైవిధ్యమైన ప్రతీకార కథకి తన మార్క్ కామెడీని మిక్స్ చేసి శ్రీను వైట్ల కొత్త యాంగిల్ లో ఈ చిత్రాన్ని మలిచారు. కాగా ట్రైలర్ లో ప్రధానంగా ‘దిస్ ఈజ్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. ఐయామ్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, వియ్ ఆర్ స్ట్రాంగ్..’ అని రవితేజ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ ను బాగా ఎలివేట్ చేసింది.
ఇక ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం విజయం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. ఈ సారి మాత్రం ఇద్దరు భారీ సక్సెస్ కొట్టేలానే ఉన్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.

