విమ‌ర్శ‌లు స్వీక‌రిస్తున్నాం – వరుణ్ తేజ్

విమ‌ర్శ‌లు స్వీక‌రిస్తున్నాం – వరుణ్ తేజ్

Published on Dec 24, 2018 6:55 PM IST

varun tej1

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా హీరోగా నటించిన చిత్రం ‘ అంత‌రిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు.

కాగా ఈ రోజు ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘వినూత్న‌మైన ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రించ‌డం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని స్వీక‌రిస్తున్నాం. భ‌విష్య‌త్‌లో వాటిని పున‌రావృతం కాకుండా చూసుకుంటాం.’ అన్నారు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైవిధ్య‌మైన ప్ర‌యోగాలు మ‌రిన్ని చేయ‌డానికి స్ఫూర్తినిచ్చిన విజ‌య‌మిది. మ‌న బ‌డ్జెట్‌లో కొత్త ఆలోచ‌న‌ల‌తో సినిమాలు తీయ‌వ‌చ్చ‌ని నిరూపించింది. ఇదే పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకుపోతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.’ అని తెలిపారు.

తాజా వార్తలు