ఆర్ఎక్స్ 100 హీరో కొత్త సినిమా లాంచ్ !

ఆర్ఎక్స్ 100 హీరో కొత్త సినిమా లాంచ్ !

Published on Dec 27, 2018 6:01 PM IST

RX

ఆర్ఎక్స్100 చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో కార్తికేయ. ఇక ఈచిత్రం తరువాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో భాగంగా ఈ హీరో ప్రస్తుతం తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ‘హిప్పీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తెలుగు , తమిళ భాషల్లో విడుదలకానుంది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంసెట్స్ మీద ఉండగానే కార్తికేయ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్‌ జంధ్యాల తో సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పాడు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి జరుగనుంది. ఈచిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు.

తాజా వార్తలు