3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు !

3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు !

Published on May 12, 2019 8:00 PM IST

Lisa

దర్శకుడు రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం `లీసా 3డి`. కాగా తెలుగులో వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తామని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.

దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ..“రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా 3డిలో డిఫరెంట్ గా ప్రయత్నించిన చిత్రమిది. నాణ్యమైన విజువల్స్ కోసం 8కె ఫార్మాట్ లో తెరకెక్కించి 2కె ఫార్మాట్ కి మార్చాం. ఛాయాగ్రాహకుడు పీజీ ముత్తయ్య ఈ సినిమా విజువల్స్ ని మరో లెవల్లో చూపించారు.` అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..“ షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్.కె. పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాం. అలాగే ఈ లీసా త్రీడి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా 3డి దెయ్యం గగుర్పాటుకు గురి చేయడం గ్యారెంటీ. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

తాజా వార్తలు