విక్రమ్ సరసన రాఖీ భాయ్ లవర్

విక్రమ్ సరసన రాఖీ భాయ్ లవర్

Published on Oct 16, 2019 4:13 PM IST

vikram1

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ త్వరలో తన 58వ సినిమాను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్నాడు. భారీ వ్యయంతో నిర్మితంకానున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయకిగా నటించనుంది. శ్రీనిధి శెట్టి అని పేరు చెబితే ఆమె ఎవరో త్వరగా గుర్తురాకపోవచ్చు కానీ ‘కె.జి.ఎఫ్’ చిత్రంలో రాఖీ భాయ్ ప్రేయసి అంటే మాత్రం ఠక్కున కళ్ల ముందు నిలుస్తుంది.

‘కె.జి.ఎఫ్’ సినిమా సాధించిన విజయంతో ఈ కన్నడ భామ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఆ తర్వాత చాలా ఆఫర్లే వచ్చినా ఆచితూచి ప్రాజెక్ట్స్ ఓకే చేస్తోంది శ్రీనిధి. తమిళంలో మొదటిసారే విక్రమ్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది.. ఈ డబ్బింగ్ వెర్షన్ హిట్టైతే తెలుగులో కూడా ఆమెకు ఆఫర్లు రావచ్చు. ప్రస్తుతం ఈమె ‘కె.జి.ఎఫ్ 2’లో బిజీగా ఉంది.

వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రంలో విక్రమ్ సుమారు 25 భిన్నమైన వేషధారణల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు