క్రేజీ టీవీ షోని ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్న ఉపరాష్ట్రపతి !

క్రేజీ టీవీ షోని ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్న ఉపరాష్ట్రపతి !

Published on May 4, 2020 12:15 PM IST

Venkaiah Naidu

క్రేజీ టీవీ సీరియల్ రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ ధారావాహిక 33 ఏళ్ల తర్వాత కూడా తన సత్తా చాటుతోంది. భారత టెలివిజన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘రామాయణం’ ధారావాహికను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ ధారావాహిక ప్రశంసలు కురిపించారు.

ఇక లాక్ డౌన్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో టెలివిజన్ ఛానెల్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ఈ టీవీ షోను పునఃప్రసారం చేశారు. కొద్దిరోజులుగా ఈ సీరియల్ డి డి నేషనల్ ఛానెల్ లో ప్రసారం అవుతుంది. కాగా గత నెల 16న ఈ టీవీ షో ఏకంగా 77 మిలియన్స్ అనగా 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచ రికార్డు కావడం గమనార్హం.

తాజా వార్తలు