విజన్ సినిమాస్ పతాకం పై ఆది సాయి కుమార్ హీరో గా సరికొత్త సినిమా!

విజన్ సినిమాస్ పతాకం పై ఆది సాయి కుమార్ హీరో గా సరికొత్త సినిమా!

Published on Aug 15, 2021 3:28 PM IST

IMG 20210815 WA0022

డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడు ఆది హీరో గా నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జి. గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. విజ‌న్ సినిమా బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో హీరో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఆగ‌స్ట్ 15 వ తేదీన టి.ఎం.కె అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. ఈ చిత్రం లో పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా లో ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యహరిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌ణికాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు