అవైటెడ్ బోల్డ్ సిరీస్ ఫైనల్ సీజన్ కి డేట్స్ ఫిక్స్.. ప్రైమ్ వీడియో బిగ్గెస్ట్ హిట్ సిరీస్ ముగింపు ఎప్పుడు నుంచి అంటే

అవైటెడ్ బోల్డ్ సిరీస్ ఫైనల్ సీజన్ కి డేట్స్ ఫిక్స్.. ప్రైమ్ వీడియో బిగ్గెస్ట్ హిట్ సిరీస్ ముగింపు ఎప్పుడు నుంచి అంటే

Published on Mar 9, 2026 9:02 AM IST

The-Boys

ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అవైటెడ్ ఓటీటీ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. మరి ఈ ఓటీటీ లలో వరల్డ్ వైడ్ మంచి హిట్ అయ్యిన సిరీస్ లలో బోల్డ్ యాక్షన్ సిరీస్ ది బాయ్స్ కూడా ఒకటి. సూపర్ హీరో జానర్ లో ఈ సిరీస్ 4 సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో అంతా ఐదవ సీజన్ అందులోని ఫైనల్ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఫైనల్ గా ప్రైమ్ వీడియో వారు ఈ సీజన్ తాలూకా ఎపిసోడ్స్ అన్నింటి డేట్స్ ని ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ అవైటెడ్ సిరీస్ తాలూకా మొదటి రెండు ఎపిసోడ్స్ ఈ ఏప్రిల్ 8న స్ట్రీమింగ్ కి తీసుకొస్తుండగా అక్కడ నుంచి మళ్ళీ వారానికి ఒకో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రానుంది. ఇలా మొత్తం 8 ఎపిసోడ్స్ ని ఫైనల్ సీజన్ కి డిజైన్ చేసి రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

ఫైనల్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఈ మే 20న స్ట్రీమ్ కానుంది. అక్కడతో ఈ పాపులర్ సిరీస్ కూడా ముగియనుంది. ఇక ఈ సిరీస్ లో కార్ల్ అర్బన్, ఆంటోనీ స్టార్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఫిల్ గ్రిసియా దర్శకత్వం వహించారు. అలాగే ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు