డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా. మోహన్ స్వీయ దర్శకత్వం లో ఈశ్వర పార్వతి మూవీస్ పతాకం పై తెరకెక్కుతున్న తాజా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 1997 లో జగపతి పాత్రలో నవీన్ చంద్ర లుక్ ని విడుదల చేశానని తెలిపారు. తను పుట్టిన తరువాత రెండేళ్లకు 1997 వచ్చిందని, నవీన్ లుక్ బాగుంది అంటూ చెప్పుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలి అని కోరారు. మోహన్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
హీరో, దర్శకులు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఉన్న మూడు ముఖ్య పాత్రల్లో నవీన్ చంద్ర పాత్రను రివీల్ చేసినందుకు మా హీరో విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు. ఈ సందర్బంగా విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ సినిమా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నానని, ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేేసినట్లు తెలిపారు. అంతేకాక ఈ సినిమా విషయం లో తనకు ప్రతి విషయంలో సపోర్ట్ అందించిన కోటి గారికి థాంక్స్ అని అన్నారు. అలాగే ఇందులో నటించిన నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి అని, కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు అని అన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని, అలాగే తన ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం కోటి అందిస్తున్నారు.


