మరోసారి ఓంకార్ సూపర్ హిట్ రియాలిటీ షో..!

మరోసారి ఓంకార్ సూపర్ హిట్ రియాలిటీ షో..!

Published on Aug 16, 2021 10:05 PM IST

Om

ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్ వంటి షోలకు యాంకర్‌గా వ్యవహరించి ఓంకార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యాంకరింగ్‌ని పక్కన పెట్టి దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఈ మధ్య ‘సిక్త్స్ సెన్స్’ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర వీక్షకులకు ఓంకార్ మళ్లీ దగ్గరయ్యాడు. అయితే ఓంకార్ నిర్వహించిన కిడ్స్ రియాలిటీ షో ‘మాయాద్వీపం’ మళ్లీ మొదలు కాబోతుంది.

అయితే 2007లో తొలిసారి ప్రారంభమైన ‘మాయా ద్వీపం’ రియాలిటీ షో వరుసగా మూడేళ్లు కొనసాగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చి ప్రారంభమై మళ్లీ రెండేళ్లు కొనసాగి ఆగిపోయింది. అయితే ఏడేళ్ల తర్వాత ఈ షో మళ్లీ జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. దీనికి సంబంధించి ఓ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అద్భుత దీపం కోసం ముగ్గురు చిన్నారులు ఓ పురాతన భవనంలోకి వెళతారు. అక్కడ ఓ భారీ తలుపును తెరవగా వారికి ఓంకార్ కనిపిస్తాడు. ఇక్కడకెందుకు వచ్చారు అని ఓంకార్ పిల్లలని అడగ్గా అద్భుత దీపం కోసం వచ్చామని చెబుతారు. అద్భుత దీపం కావాలంటే రావాల్సింది ఇక్కడకు కాదని మాయద్వీపంకి వెళ్లాలని ఆ పిల్లలకు చెబుతాడు. త్వరలోనే ఈ షో ప్రారంభం కాబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు